Share News

70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:33 PM

రాష్ట్రంలో విధులను సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ వైద్యులపై కూటమి సర్కార్ మరో సారి కొరడా ఝుళిపించింది. సుదీర్ఘకాలం పాటు అనధికారంగా విధులకు గైర్హాజరీ అయిన వైద్యులకు ప్రభుత్వం ఉద్వాసన తెలిపింది. 70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించింది.

70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలు

అమరావతి, అక్టోబర్ 02: రాష్ట్రంలో విధులను సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ వైద్యులపై కూటమి సర్కార్ మరో సారి కొరడా ఝుళిపించింది. సుదీర్ఘకాలం పాటు అనధికారంగా విధులకు గైర్హాజరీ అయిన వైద్యులకు ప్రభుత్వం ఉద్వాసన తెలిపింది. 70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించింది. ఇదే రీతిగా వ్యవహరిస్తున్న 193 మందిపై చర్యలు తీసుకోనుందని.. అందుకు సంబంధించిన చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమా‌ర్‌కు డీఎస్‌హెచ్, డీఎంఈ అధికారులు అందజేశారు.


ఈ నేపథ్యంలో 70 మంది వైద్యులను తొలగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దని ఈ సందర్భంగా అధికారులను మంత్రి సత్య కుమార్ ఆదేశించారు. ఈ ఏడాది మే మాసంలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏళ్ల తరబడి విధులకు దూరంగా ఉన్న 51 మంది వైద్యులను కూటమి ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి: విజయా రెడ్డి

పొన్నూరులో రూ.32.10 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

Updated Date - Oct 02 , 2026 | 01:56 PM