Share News

కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి: విజయా రెడ్డి

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:13 PM

దానం నాగేందర్ ఎన్నిక చెల్లకపోతే తనను ఎమ్మెల్యే ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తన వాదనను కోర్టు పూర్తిగా విశ్వసిస్తోందని అన్నారు. తనకు హైకోర్టుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడుతూ..

కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి: విజయా రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 02: దానం నాగేందర్ ఎన్నిక చెల్లకపోతే తనను ఎమ్మెల్యే ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తన వాదనను కోర్టు పూర్తిగా విశ్వసిస్తోందని అన్నారు. తనకు హైకోర్టుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల పిటిషన్‌పై తీర్పు రాకుండా ఉప ఎన్నిక నిర్వహించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. తన పిటిషన్ పక్కన పెడితే కారణాలు ఏమిటని మళ్లీ తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. అయితే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలని విజయా రెడ్డి పేర్కొన్నారు.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయా రెడ్డి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో దానం నాగేందర్‌పై 22,010 ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం దానం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ తన అఫిడవిట్‌లో ఆస్తుల విషయంలో కీలక సమాచారాన్ని దాచి పెట్టారంటూ విజయా రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించి.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో స్పష్టం చేశారు.


ఈ పిటిషన్‌ విచారణ పెండింగ్‌లో ఉంది. మరో వైపు దానంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ జారీ చేశారు. దీంతో సదరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాంటి వేళ.. దానం నాగేందర్ ఆస్తులపై తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు ఈ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విజయా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు.. మంగళవారానికి తదుపరి విచారణకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలు

పొన్నూరులో రూ.32.10 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

Updated Date - Oct 02 , 2026 | 01:54 PM