Share News

పొన్నూరులో రూ.32.10 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:27 PM

గుంటూరు జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

పొన్నూరులో రూ.32.10 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
Minister Narayana

గుంటూరు జిల్లా, అక్టోబర్ 2: జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు(శుక్రవారం) మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పొన్నూరులో గాంధీజీ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32.10 కోట్లు విలువైన పనులకు నారాయణ శంకుస్థాపన చేశారు.


రూ.22.10 కోట్ల విలువైన నీటి సరఫరా పనులకు, నాగుల చెరువు పునరుద్ధరణ పనులకు నారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 కోట్ల విలువైన సీసీ రోడ్లు, గ్రీనరీ పనులకు శంకుస్థాపన జరిగింది. పొన్నూరు మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం రూ.126.28 కోట్లు ఖర్చు పెడుతోందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్

రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 01:27 PM