Share News

బీజేపీలో గూటికి సీరియల్ ఆర్టిస్టులు.. ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 02:06 PM

భాగ్యనగరంలో పలువురు సీరియల్ ఆర్టిస్టులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. టీవీ ఆర్టిస్ట్ వేములపల్లి స్వర్ణలత సహా పలువురిని బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో గూటికి సీరియల్ ఆర్టిస్టులు.. ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్
tv artists joined bjp party

హైదరాబాద్, అక్టోబర్ 2: నగరంలోని బీజేపీ కార్యాలయంలో పలువురు సీరియల్ ఆర్టిస్టులు కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. టీవీ ఆర్టిస్ట్ వేములపల్లి స్వర్ణలత సహా పలువురు సీరియల్ ఆర్టిస్టులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అక్రమ సంపాదనల విషయంలో ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంపాదించుకోవడం కాదు.. అసలు ప్రజలేం సంపాదించుకున్నారో ఎప్పుడైనా చెప్పారా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతి చిట్టా బయట పెడతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా.. ఒక్కరినైనా జైలుకు పంపలేదు. అవినీతికి పాల్పడడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. తమ సమస్యను పరిష్కరించాలని గాంధీ భవన్ వద్ద ధర్నా చేస్తున్న టీచర్లను అరెస్ట్ చేసింది. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులను పట్టించుకోవాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తోంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 02:57 PM