పుంగనూరులో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. వైసీపీ దూరం!
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:03 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెదురుమదురు ఘటనల నడుమ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాగా.. పుంగనూరులో వైసీపీ ఒక్క నామినేషన్ కూడా వేయలేదు.
చిత్తూరు జిల్లా, అక్టోబర్ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిన్న చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. దీంతో పుంగనూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నాయి.
చిత్తూరు కార్పొరేషన్తో పాటు నగిరి, పలమనేరు, కుప్పం, మదనపల్లి మున్సిపాలిటీల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క పుంగనూరు మినహా మిగిలిన అన్ని చోట్ల కూటమితో పాటు వైసీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరుకు వెళ్లరాదంటూ.. ఈ రోజు(ఆదివారం) ఉదయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పుంగనూరుకు వెళ్లనందున.. వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రాలేదని సమాచారం. కాగా.. పుంగనూరులో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన కారణంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News