Share News

టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:31 PM

కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజేంద్ర చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజేంద్ర చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాజేంద్ర మృతిపై సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తెలిపారు. మృతుడు రాజేంద్ర కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.


రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు, టీడీపీ తరపున మరో రూ.10 లక్షలు మొత్తంగా రూ. 20 లక్షలను రాజేంద్ర కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుడు రాజేంద్ర నివాసానికి కుప్పం టీడీపీ నేతలు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి న్యాయం చేస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని టీడీపీ నేతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 07:51 PM