కుప్పంలో తాటి ముంజలు ఆస్వాదించిన సీఎం దంపతులు
ABN , Publish Date - May 20 , 2026 | 03:57 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. బుధవారం సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు.
చిత్తూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు (బుధవారం) సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు. ఈ క్రమంలో రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న ఒక పేద కార్మికుడి వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా వాహనం దిగి, ఆ కార్మికుడి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, ఆయనతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ విషయాన్ని సీఎం తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాటి ముంజలు అమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజల కష్టం, వారి జీవన విధానం, సహజసిద్ధమైన ఆహారాల ప్రాధాన్యం గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, అప్యాయతలను అక్కడున్న స్థానికులు ఎంతో ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News