Share News

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - May 14 , 2026 | 11:53 AM

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు
Special Weekly Train

  • ప్రయాణికులకు ఉపశమనం

గుంతకల్లు(అనంతపురం): ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌-బెళగావి (వయా గుంతకల్లు) మధ్య వీక్లీ రైలును నడపాలని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. బెళగావి-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17072) రైలు ఈ నెల 15 నుంచి మొదలవుతుంది. బెళగావిలో శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు ఈ నెల 21వ తేదీ నుంచి హైదరాబాద్‌లో గురువారాల్లో సాయంత్రం నాలుగున్నరకు బయలుదేరి శుక్రవారం ఉదయం పదిన్నరకు బెళగావికి చేరుకుంటుంది. ఈ రైలు హైదరాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోరణగల్లు, హోస్పేట, కొప్పల్‌, గదగ్‌, హుబ్లీ, ధార్వాడ, లోండా, ఖానాపూర్‌ స్టేషన్ల మీదుగా బెళగావికి చేరుతుంది.


ప్రత్యేక రైళ్ల రెగ్యులరైజేషన్‌

  • గుంతకల్లు మీదుగా నడిచే రెండు ప్రత్యేక రైళ్లను రెగ్యులరైజ్‌ చేశారు. బెంగళూరు-బీదర్‌ ప్రత్యేక రైలును (16559) ఈ నెల 15వ తేదీ నుంచి బైవీక్లీ (శుక్ర, ఆదివారాలు) ఎక్స్‌ప్రె్‌సగా రెగ్యులరైజ్‌ చేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలును(16560) ఈ నెల 16వ తేదీ నుంచి శని, సోమవారాల్లో నడిచే బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా మార్చారు. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాద్గిర్‌, వాడి, షాహాబాద్‌, కలబురగి, హుమ్నాబాద్‌ స్టేషన్ల మీదుగా వెళుతుంది.


  • బెంగళూరు కంటోన్మెంటు-కలబురగి (16563) ఎక్స్‌ప్రె్‌సను ఈ నెల 16 నుంచి వీక్లీ (శనివారాల్లో నడిచే) ఎక్స్‌ప్రె్‌సగా రెగ్యులరైజ్‌ చేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (16554)ను 17వ తేదీ నుంచి ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్‌, వాడి, షాహాబాద్‌ స్టేషన్ల మీదుగా వెళుతంది.


తాడిపత్రి మీదుగా..

తాడిపత్రి మీదుగా తిరుపతి-ఓకా-తిరుపతి మధ్య వీక్లీ రైలు ఈ నెల 14న ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-ఓకా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (19559) రైలు తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరి, 11.54 గంటలకు తాడిపత్రికి వచ్చి, మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు ఓకాకు చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (19560) ఓకాలో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.13 గంటలకు తాడిపత్రికి, రాత్రి 11.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, డోన్‌, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్‌, కాచిగూడ, బోలారం, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, హెచ్‌ఎ్‌స నాందేడ్‌, పూర్ణా, బస్మఠ్‌, హింగోలి, వాసిం, అకోలా, మల్కాపూర్‌, భూసావల్‌, జల్‌గావ్‌, అమల్నేర్‌, నందుర్బార్‌, ఉడ్నా, భరుచ్‌, వడోదర, ఆనంద్‌, అహ్మదాబాద్‌, విరంగం, సురేంద్రనగర్‌, వాకనేర్‌, రాజ్‌కోట్‌, హాపా, జాంనగర్‌, ఖంభలియా, ద్వారకా స్టేషన్ల మీదుగా ఓకాకు వెళుతుంది.


గుంతకల్లు మీదుగా మరో రెండు

సికింద్రాబాద్‌-బెళగావి, చర్లపల్లి-బెళగావి (వయా గుంతకల్లు) మధ్య రెండు వీక్లీ రైళ్లను నడపనున్నారు. చర్లపల్లి-బెళగావి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (17075) ఈ నెల 16 నుంచి శనివారాల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.30కి బెళగావికి చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు ఈ నెల 17 నుంచి ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బెళగావిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాదగిరి, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోరణగల్లు, హోస్టేట, కొప్పల్‌, గదగ్‌, హుబ్లీ, ధార్వాడ, లోండా, ఖానాపూర్‌ స్టేషన్ల మీదుగా బెళగావికి చేరుతుంది.


pandu1.2.jpg

  • సికింద్రాబాద్‌-బెళగావి ఎక్స్‌ప్రెస్‌ (17073) రైలు ఈ నెల 18 నుంచి సోమవారాల్లో సాయంత్రం 4.30కి సికింద్రాబాద్‌లో బయలేదేరి, మరుసటిరోజు ఉదయం 10.30కి బెళగావికి చేరుతుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (17074) ఈ నెల 19 నుంచి మంగళవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బెళగావిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కూడా చర్లపల్లి-బెళగావి ఎక్స్‌ప్రెస్‌ రూటులోనే వెళుతుంది.


రైళ్ల రద్దు

నైరుతి రైల్వేలో నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు పరచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడటౌన్‌-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ (17289) రైలును జూలై 31న, దీని తిరుగు ప్రయాణపు రైలును (17290) ఆగస్టు 1న, యశ్వంతపూర్‌-బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ (16577) రైలును, దాని తిరుగు ప్రయాణపు రైలును (16578) ఆగస్టు 1న రద్దు చేశారు.


అక్కడివరకూ..

నాందేడ్‌-బెంగళూరు (16594) ఎక్స్‌ప్రెస్‏ను జూన్‌ 16 నుంచి ఆగస్టు 3 వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును (16593) జూన్‌ 17 నుంచి ఆగస్టు 3 వరకూ బెంగళూరు వరకూ కాకుండా యల్హంక వరకూ మాత్రమే నడుపుతారు.

  • బెంగళూరు-అనంతపురం మెము ప్యాసింజరును(66559) జూలై 17 నుంచి 20 వరకూ, ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును(66560) జూలై 31 నుంచి ఆగస్టు 3వతేదీ వరకూ బెంగళూరు వరకూ కాకుండా బెంగళూరు కంటోన్మెంటు స్టేషన్‌ వరకూ మాత్రమే నడుపుతారు.


  • ముంబై-బెంగళూరు-ముంబై (11301/02) ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకూ బెంగళూరు వరకూ కాకుండా ముంబై-యల్హంక మధ్యన మాత్రమే నడుపుతారు. ఢిల్లీ-బెంగళూరు మధ్య నడిచే కర్ణాటక ఎక్స్‌ప్రె్‌సను (12628) జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును(12627) ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకూ బెంగళూరు వరకూ కాకుండా బయ్యపనహళ్లి వరకు మాత్రమే నడుపుతారు.


  • బెంగళూరు-జోద్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‏ను (16534) ఆగస్టు 2న, హజ్రత్‌ నిజాముద్దీన్‌-బెంగళూరు (22692) రాజధాని ఎక్స్‌ప్రె్‌సను జూన్‌ 30 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును (22691) ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకూ బెంగళూరు వరకూ కాకుండా హజ్రత్‌ నిజాముద్దీన్‌-యశ్వంతపూర్‌ మధ్యన మాత్రమే నడుపుతారు.

  • బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు మధ్య నడిచే డెము (06595/96) ప్యాసింజరు రైళ్లు ఆగస్టు 1 నుంచి 4 వరకూ బెంగళూరు కంటోన్మెంటు స్టేషన్‌ వరకే నడుస్తాయి.

  • బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463) జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (18464) ఆగస్టు 1 నుంచి 3 వరకూ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌ వరకే నడుపుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 11:57 AM