ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం
ABN , Publish Date - May 14 , 2026 | 11:15 AM
ట్యాంకర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాంధీనగర్, మే 14: ట్యాంకర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సురేంద్రనగర్ జిల్లాలో సంఘాని గ్రామ సమీపంలోని చోటిల్లా- రాజ్‌కోట్ జాతీయ రహదారిపై జరిగింది. క్షతగాత్రులను రాజ్‌కోట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ టైర్ పేలడంతో.. అదుపు తప్పి ఎదురుగా ఉన్న రహదారిపైకి దూసుకొచ్చిందని పోలీసులు తెలిపారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు.. ఆ ట్యాంకర్‌ను ఢీకొట్టిందని వివరించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నిప్పురవ్వలు ఎగసిపడి.. క్షణాల్లో మంటలు చెలరేగాయని చెప్పారు.
దీంతో బస్సులోని ప్రయాణికులు భయంతో కిందకి దూకి పరుగులు తీశారని పేర్కొన్నారు. అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించిందని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే.. అగ్నిమాపక శకటాలు ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి
కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు
For More National News And Telugu News