Share News

మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి

ABN , Publish Date - May 14 , 2026 | 08:09 AM

స్థానిక చెక్క వంతెన సమీపంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటి వద్ద ప్రియుడు మహేశ్ తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు.

మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి

సత్తెనపల్లి, మే 14: స్థానిక చెక్క వంతెన సమీపంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటి వద్ద ప్రియుడు మహేశ్ తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై గొడ్డలి, రాడ్లతో వారు హల్‌చల్ చేశారు. వారిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. వారిపై యువకులు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దాంతో యువకులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు వెంటనే వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.


మహేశ్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మహేశ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బస్సును డీ కొట్టిన లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

For More AP News And Telugu News

Updated Date - May 14 , 2026 | 08:50 AM