Share News

కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు

ABN , Publish Date - May 14 , 2026 | 09:25 AM

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతోపాటు ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది.

కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు
PM Modi

న్యూఢిల్లీ, మే 14: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతోపాటు ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించాలని ప్రజలకు స్పష్టం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.


ప్రభుత్వ క్వార్టర్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేక షటిల్ బస్సులు ప్రారంభించినట్లు తెలిపింది. మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం అదనపు రవాణా భత్యాన్ని పెంచుతామని ప్రకటించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల పని వేళల్లో మార్పుల కోసం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించింది.


నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) వాడే ఉద్యోగులకు ఆ కార్డులో ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్, రైడ్ సదుపాయాలతోపాటు ఎలక్ట్రిక్ రిక్షాల సంఖ్యను కూడా పెంచినట్లు వివరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం కార్ పూలింగ్, మెట్రో ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరింది.


ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో పొదుపు చర్యలు చేపట్టాలంటూ వివిధ మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ విస్టా ఏరియాలో సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించింది. ఉదయం 8:30 నుంచి 9:30 మధ్య ప్రతి 10 నిమిషాలకు ఒక షటిల్ బస్సు అందుబాటులో ఉంటుందని వివరించింది. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా పరిధిలో తిరగడానికి 12 ప్రత్యేక బస్సులతో 'ఇన్నర్ - ఔటర్ లూప్' వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కేంద్రం వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బస్సును డీ కొట్టిన లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి

For More National News And Telugu News

Updated Date - May 14 , 2026 | 10:52 AM