Share News

లిఫ్ట్‌లు భద్రమేనా..?

ABN , Publish Date - May 14 , 2026 | 10:05 AM

అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట శాపం అవుతున్నాయి.

లిఫ్ట్‌లు భద్రమేనా..?
Apartments Lifts

  • అపార్ట్‌మెంట్స్‌లలో తరచుగా ప్రమాదాలు

  • అకస్మాత్తుగా డోర్లు తెరుచుకోవడం, మధ్యలో ఆగిపోవడంతో ఇబ్బందులు

  • నాణ్యత లేకపోవడం, నిర్వహణ పట్టించుకోకపోవడమే కారణాలు

  • ప్రమాదాల నివారణకు సూచనలు పాటించాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌ సిటీ: అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట శాపం అవుతున్నాయి. నగరంలో ఈ మూడు నాలుగేళ్ల కాలంలో అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం, గాయాలు పాలవడం వంటి సంఘటనలు బాగా పెరిగాయి. తాజాగా శేరిలింగంపల్లి పరిధి గౌలిదొడ్డిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. మెట్లు ఎక్కలేక చాలా మంది లిఫ్ట్‌లు. అయితే పెట్టిస్తున్నారు కానీ, వాటి నిర్వహణ సంగతిని అటు బిల్డర్లు, ఇటు అపార్ట్‌మెంట్‌ సొసైటీలు పట్టించుకోకపోవడంతో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


ఇటీవల లిఫ్ట్‌ రోప్‌లు తెగి పడిపోవడం, లిఫ్ట్‌లో ఉండగా అకస్మాత్తుగా డోర్‌లు తెరుచుకోవడం, డోర్లు సరిగా పడకపోయినా లిఫ్ట్‌ వెళ్లడం లాంటివి జరుగుతున్నాయి. ఈప్రమాదాలకు కారణం నైపుణ్యం లేని ఇంజినీర్లు బిగించడం, నాణ్యత లేని మెటీరియల్‌, సరైన నిర్వహణ లేకపోవడమేనని తెలుస్తోంది. చాలావరకు అపార్ట్‌మెంట్‌లలో తక్కువ ధరలో వస్తుందని కోలాప్సబల్‌ (గ్రిల్‌) గేట్లు ఉన్న లిఫ్ట్‌లు పెడుతున్నారు. అవి పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకూ వాటితో ప్రమాదమే. ఈ గ్రిల్స్‌ మధ్య చేతులు ఇరుక్కుని, లేదంటే జుట్టు పట్టేసి ప్రాణాపాయస్థితిలోకి చేరుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది.


city4.jpgలిఫ్ట్‌ అమర్చే ముందు ఏం చూడాలంటే?

అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌లను ఎలా ఎంచుకోవాలి, భద్రత పరంగా ఏవి మేలనే విషయమై ఓ ప్రముఖ లిఫ్ట్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా చేస్తున్న లింగారెడ్డి అందిస్తున్న సూచనలివి.

  • లిఫ్ట్‌ను ఎంపిక చేసుకునే ముందు లోడ్‌, సామర్థ్య అవసరాలు తెలుసుకోవాలి.

  • అపార్ట్‌మెంట్లు అయితే ఎంతమంది ఉంటారు, తరచుగా లిఫ్ట్‌ ఎంత మంది ఉపయోగిస్తుంటారు, లిఫ్ట్‌ వేగం, సేఫ్టీ సిస్టమ్స్‌, ఆటోమేటిక్‌ రెస్క్యూ సిస్టమ్‌, లోడ్‌ వెయిటింగ్‌ డివైజ్‌, మెకానికల్‌ సేఫ్టీ లాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.


  • పిల్లలు అధికంగా ఉన్న అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో ఆటోమెటిక్‌ డోర్‌ లిఫ్ట్‌లు ఎంచుకోవడం శ్రేయస్కరం. మాన్యువల్‌ కొలాప్సబల్‌ గేట్లు (గ్రిల్స్‌) ఉన్న లిఫ్ట్‌లు చాలా ప్రమాదకరం.

  • మెషీన్‌ రూమ్‌ లెస్‌ (ఎంఆర్‌ఎల్‌) లిఫ్ట్‌లు ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో ఎలాంటి జెర్క్‌లూ ఉండవు. ఫ్లోర్‌ లెవలింగ్‌ కచ్చితంగా ఉంటుంది. కమర్షియల్‌ బిల్డింగ్స్‌తో పాటుగా గేటెడ్‌ అపార్ట్‌మెంట్‌లలో వీటిని వాడుతున్నారు. విల్లాల్లో అయితే వాక్యూమ్‌ లిఫ్ట్‌లు ఎంచుకోవచ్చు.

  • తరచుగా లిఫ్ట్‌లను సర్వీస్‌ చేయిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశాలు తక్కువ.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 10:05 AM