Share News

వేసవిలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

ABN , Publish Date - May 14 , 2026 | 09:07 AM

వేసవిలో అరటిపండ్లు చాలా త్వరగా పండిపోయి నల్లబడిపోతాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అరటిపండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
Banana Storage Tips

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో అరటిపండ్లు చాలా త్వరగా పండిపోవడంతో పాటు పాడైపోతాయి. ఇంటికి తెచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే అవి నల్లబడిపోవడం సాధారణం. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అరటిపండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.


అరటిపండ్ల కాడలను కప్పి ఉంచాలి

అరటిపండ్లు త్వరగా పండిపోవడానికి ఇథిలీన్ అనే వాయువు కారణం. ఈ వాయువు ఎక్కువగా కాడల దగ్గర నుంచే విడుదల అవుతుంది. అందుకే అరటిపండ్ల కాడలను ప్లాస్టిక్ ర్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో కప్పితే అవి త్వరగా పండిపోకుండా ఉంటాయి. దీంతో ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటాయి.


ఇతర పండ్లతో కలిపి పెట్టొద్దు

ఆపిల్‌, మామిడి, బొప్పాయి వంటి పండ్లు కూడా ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. వాటి దగ్గర అరటిపండ్లు ఉంచితే మరింత వేగంగా పండిపోతాయి. కాబట్టి అరటిపండ్లను ప్రత్యేకంగా ఒక బుట్టలో లేదా స్టాండ్‌పై ఉంచడం మంచిది. అలాగే నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి.


వేలాడదీసి నిల్వ చేయాలి

చాలామంది అరటిపండ్లను టేబుల్‌పై లేదా ప్లేట్‌లో పెడతారు. దీంతో కింద భాగం నలిగి త్వరగా పాడవుతుంది. అరటిపండ్లను హుక్‌ లేదా బనానా స్టాండ్‌కు వేలాడదీసి ఉంచితే గాలి సమానంగా తగులుతుంది. దీంతో అవి త్వరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా

For More Latest News

Updated Date - May 14 , 2026 | 09:07 AM