దారి చూపని ‘గమ్యం’!
ABN , Publish Date - May 14 , 2026 | 10:47 AM
ప్రయాణికులకు బస్సుల వివరాలు, సమయపాలన తెలియజేయాల్సిన ఆర్టీసీ గమ్యం యాప్ రూట్ తప్పుతోంది.
బస్సులు స్టాప్ దాటి వెళ్లినా నో అప్‌డేట్
పట్టించుకోని గ్రేటర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు
యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలు
హైదరాబాద్ సిటీ: ప్రయాణికులకు బస్సుల వివరాలు, సమయపాలన తెలియజేయాల్సిన ఆర్టీసీ గమ్యం యాప్ రూట్ తప్పుతోంది. యాప్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత బస్సుల వివరాలు యాప్‌లో కన్పించడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉన్నా... ఎన్ని నిమిషాల్లో బస్సులు సమీపంలోని స్టాప్‌కు వస్తాయనే సమాచారం యాప్‌లో చూపించడం లేదని యూసుఫ్‌గూడకు చెందిన మనోహర్ తెలిపారు.
బస్సులు స్టాప్ దాటి వెళ్లినా 10-15 నిమిషాల తర్వాత కూడా ఆ బస్సు ఇంకా రాలేదనే సమాచారం యాప్‌లో కన్పించడంతో బస్సు కోసం ప్రయాణికులు బస్టాపుల్లో ఎదురుచూస్తున్నారు. గ్రేటర్‌జోన్‌లో ఆర్టీసీ 3200 బస్సులు నడుపుతుండగా వాటిలో కొన్ని రూట్లలో బస్సులు వివరాలు యాప్‌లో చూపించడం ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
పడిగాపులు
బస్సులు రాకపోవడంతో రాత్రివేళల్లో బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. రాత్రివేళల్లో సర్వీసులు తక్కువ. అందులో కొంతమంది డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులను ఆపకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు. సికింద్రాబాద్-కూకట్‌పల్లి, ఈసీఐఎల్-అఫ్జల్‌గంజ్, ఉప్పల్-మెహదీపట్నం రూట్ల లో రాత్రి తొమ్మిది తర్వాత బస్సులు రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ సమయం లో సర్వీసుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News