Share News

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..

ABN , Publish Date - May 14 , 2026 | 08:56 AM

భారత్‌కు బయలుదేరిన ఒక ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు తెలుస్తోంది. నౌక సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా భారత నావికాదళం అన్ని సహాయసహకారాలు అందిస్తోంది.

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..
India Bound LPG Tanker Crosses Hormuz

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు బయలుదేరిన ఎల్‌పీజీ ట్యాంకర్ ఎమ్‌వీ సన్‌షైన్ తాజాగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలో ఈ నౌక భారత్‌కు రానుంది. ఇప్పటివరకూ 14 ఎల్‌‌పీజీ ట్యాంకర్లు దిగ్విజయంగా హోర్ముజ్‌ను దాటి భారత్‌కు చేరుకున్నట్టు సమాచారం. ఈ నౌక సురక్షితంగా గమ్యస్థానానికి చేరేలా భారత నావికాదళం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తోంది.


హోర్ముజ్‌లో పరిస్థితిపై ఇరాన్ లీగల్, అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రి కాజిమ్ ఘరీబాబాదీ బుధవారం మాట్లాడారు. శాంతిస్థాపన జరిగాక పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని అన్నారు. అయితే, దౌత్యపరిష్కారాలపై యూఎస్ తగిన శ్రద్ధ పెట్టట్లేదని కూడా ఆయన ఆరోపించారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు చొరవ తీసుకుంటున్నందుకు భారత్‌పై మంత్రి కాజిమ్ ఘరీబాబాదీ ప్రశంసలు కురిపించారు. భారత్‌ ఎలాంటి పక్షపాతం లేకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోందని కొనియాడారు. భారత్ ఎల్లప్పుడూ శాంతిస్థాపనకే మద్దతు ప్రకటించిందని అన్నారు. భారత్, ఇరాన్‌లు ఒకే సంస్కృతితో ముడిపడ్డ దేశాలని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో ఓపీటీ దుర్వినియోగం..

చైనాలో ట్రంప్‌

Updated Date - May 14 , 2026 | 09:02 AM