వైసీపీ అరాచకం..ఇళ్లపై పెట్రోలు చల్లి దాడులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:33 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకీ ఎదురుదెబ్బ తగలడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పలువురు అరాచకాలకు తెగబడుతున్నారు.
డ్రిప్పు పరికరాల దహనం.. ట్రాక్టర్‌కు నిప్పు
ఇద్దరు మహిళల పరిస్థితి విషమం
హైదరాబాద్‌కు తరలింపు
కళ్యాణదుర్గం(అనంతపురం): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకీ ఎదురుదెబ్బ తగలడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పలువురు అరాచకాలకు తెగబడుతున్నారు. టీడీపీ సానుభూతిపరులు, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఆ పార్టీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడులు చేసి, నానా బీభత్సం చేశారు. కంబదూరు మండలంలో ఆదివారం రాత్రి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అచ్చంపల్లిలో వందమందికిపైగా వైసీపీ వర్గీయులు.. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపైకి దాడులకు పాల్పడ్డారు.
ఇదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగరాజుతోపాటు వందమందికిపైగా కట్టెలు, పెట్రోల్ బాటిల్ తీసుకుని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ సానుభూతిపరులు రాధ, వరలక్ష్మి, రామసుబ్బుకు గాయాలవడంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రాధ, వరలక్ష్మి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. వీరి ఇళ్లలోని బంగారం, రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామంలోనే టీడీపీ సానుభూతిపరుడు రామాంజనేయులకు చెందిన ట్రాక్టర్‌కు వైసీపీ వర్గీయులు నిప్పు పెట్టారు.
కంబదూరు మండలంలోని రాళ్లఅనంతపురం గ్రామంలో కూడా కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించిన దామోదర్ తోటలోని వ్యవసాయ పరికరాలకు వైసీపీ వర్గీయులు నిప్పు పెట్టారు. డ్రిప్పు పరికరాలను కాల్చేశారు. స్టార్టర్ పెట్టెను ధ్వంసం చేసేశారు. డ్రిప్పు వైర్లన్నీ కోసేశారు. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. కంబదూరు మండలంలోని మేళ్లకుంటలో టీడీపీ నాయకుడు రామాంజిపై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో చేయి విరిగింది. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీలో జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
వైసీపీకి విజయభాస్కర్ రాజీనామా.. త్వరలోనే విజయసాయి రెడ్డి కొత్త పార్టీలోకి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News