Share News

వైసీపీకి విజయభాస్కర్ రాజీనామా.. త్వరలోనే విజయసాయి రెడ్డి కొత్త పార్టీలోకి!

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:25 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టనున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

వైసీపీకి విజయభాస్కర్ రాజీనామా.. త్వరలోనే విజయసాయి రెడ్డి కొత్త పార్టీలోకి!
Annapareddy Vijaya Bhaskar Reddy

విజయవాడ, నవంబర్ 10: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టనున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీలో ఎవరికీ సభ్యత్వాలు ఉండవని.. సంతకాలు లేని లెటర్ ప్యాడ్స్‌పై పదవులు ఇస్తారని తెలిపారు.


వైసీపీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేదని విజయభాస్కర్ విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని వైఎస్ జగన్ ఒమ్ముచేసుకున్నారని అన్నారు. జగన్‌తో లబ్ధిపొందిన వారు వైసీపీలో లేరన్నారు. కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి రారంటూ సంచలన కామెంట్స్ చేశారు. విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణను వైసీపీ నేతలే గెలిపించారన్నారు. గుంటూరులో కూడా వైసీపీ నేతలే కూటమిలో ఉన్న తమ మిత్రుల గెలుపు కోసం పోరాడారని చెప్పుకొచ్చారు.


జగన్ మోహన్ రెడ్డిని కలవాలి అంటే కొఠరీని కలవాలని విజయభాస్కర్ అన్నారు. భజన బృందం కోఠరీ మొత్తం కలిసి జగన్‌ను కార్యకర్తలను విడదీశారని ఆరోపించారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్ సకల శోకాలకు కారణమయ్యారంటూ అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఏలూరులో పెద్దపులి కలకలం.. ఆవు, రెండు దూడలను చంపేసిన పులి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 12:47 PM