ఏలూరులో పెద్దపులి కలకలం.. ఆవు, రెండు దూడలను చంపేసిన పులి
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:03 PM
ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వేలేరుపాడుమండలం నాళ్లవరం పంచాయతీ వద్ద పెద్ద పులి సంచారిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
ఏలూరు, నవంబర్ 10: జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వేలేరుపాడు మండలం నాళ్లవరం పంచాయతీ వద్ద పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి తాజాగా జనావాసాలవైపు వస్తూ పశువులపై దాడి చేసింది. కొత్తూరుకి చెందిన కరాటం బ్రహ్మయ్యకు చెందిన ఒక ఆవు, రెండు దూడలను పెద్దపులి దారుణం చంపేసింది. పశువులను చంపేయడంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు.. ఎప్పుడు ఎవరిపై పులి దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి.
మరోవైపు పెద్దపులి సంచారంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్థులు ఎవరూ కూడా అడవిలోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. పులి కదలికలు ఉన్న ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా సంచరించడం ప్రమాదకరమని తెలిపారు. వీలైనంత తర్వగా పులిని బంధించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌లకు నిప్పు.. సీసీటీవీలో రికార్డైన దుండగుల దృశ్యాలు
భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Read Latest AP News And Telugu News