భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:15 AM
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 10: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఈనెల 12,13,14వ తేదీల్లో హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా రాహుల్‌ను మహేశ్ ఆహ్వానించారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాల్లో ఏదో ఒకరోజు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలోనూ ఏఐసీసీ అగ్రనేత పాల్గొన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’
హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులు వరుసగా కార్యక్రమం జరుగనుంది. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘భారత్ సమ్మిట్’ను నిర్వహించనున్నాయి.
అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. దాదాపు 450 మంది ప్రముఖ ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంబంధాలు, దేశాల మధ్య సహకారం, ఆర్థిక అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై భారత్ సమ్మిట్‌లో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి...
లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌లకు నిప్పు.. సీసీటీవీలో రికార్డైన దుండగుల దృశ్యాలు
Read Latest Telangana News And Telugu News