Share News

విహారయాత్రకు వైసీపీ ఎంపీటీసీలు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:02 PM

అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీకి సమానంగా ఎంపీటీసీ స్థానాలు దక్కడంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.

విహారయాత్రకు వైసీపీ ఎంపీటీసీలు!
Singanamala MPP Election

  • శింగనమల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ

  • టీడీపీ, వైసీపీకి సమానంగా ఎంపీటీసీ స్థానాలు

బుక్కరాయసముద్రం(అనంతపురం): అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీకి సమానంగా ఎంపీటీసీ స్థానాలు దక్కడంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ 6, టీడీపీ 6 చోట్ల గెలుపొందాయి. దీంతో వైసీపీని జంపింగ్‌ల భయం వెంటాడుతోంది. ఆ పార్టీకి ఆరుగురు ఎంపీటీసీలను ఆదివారం ఉదయమే విహార యాత్రకు పంపారు.


వారు పార్టీ మారకుండా జాగ్రత్త పడుతున్నారు. వారిలో ఏ ఒక్కరు టీడీపీకి మద్దతిచ్చినా ఎంపీపీ ఎన్నిక లాంఛనమే. ఎవ్వరూ మద్దతివ్వకపోతే మాత్రం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించక తప్పదు. టాస్‌ వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీపీని బొమ్మ నిర్ణయిస్తుందో.. బొరుసు తేలుస్తుందోనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. టాస్‌ ద్వారాగానీ, చీటీద్వారాగానీ ఎంపీపీని ఎన్నుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

వైసీపీకి విజయభాస్కర్ రాజీనామా.. త్వరలోనే విజయసాయి రెడ్డి కొత్త పార్టీలోకి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 01:02 PM