Share News

డ్రోన్‌ పిచికారీకి భలే డిమాండ్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:24 PM

వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.

డ్రోన్‌ పిచికారీకి భలే డిమాండ్‌
Drone Spraying

కోహీర్‌(మెదక్): వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వ్యవసాయ కూలీల కొరతను అధిగమించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు రైతులు తమ పంటలకు డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయ డ్రోన్‌ను ఒక ఆపరేటర్‌ రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో పొలంలో నడిపిస్తూ మందును పిచికారీ చేయడానికి గంటకు రూ.500 చొప్పున చార్జ్‌ చేస్తున్నారు.


సంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరాకు మందు కొట్టడానికి గంటల సమయం పడితే, డ్రోన్‌ ద్వారా కేవలం నిమిషాల్లోనే ఈ పనిని పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా, చేతితో లేదా పంపులతో మందులు కొట్టడం వల్ల రైతులు శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది, కానీ డ్రోన్‌ వాడకంతో ఆ ముప్పు పూర్తిగా తప్పుతుంది. డ్రోన్‌ పైనుంచి స్ప్రే చేయడం వల్ల ఆకుల అడుగు భాగాన మరియు పై భాగాన మందు సమానంగా పడి పురుగుల నివారణ కూడా చాలా సమర్థవంతంగా జరుగుతుంది.


mdk2.jpgఎకరాకు కేవలం రూ.500కే అత్యాధునిక సేవలు అందుబాటులోకి రావడంతో సామాన్య రైతులు సైతం డ్రోన్‌ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభం చేకూర్చే ఈ విధానం పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, రాబోయే రోజుల్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మా చావుకు కోడలు కారణం కాదు

తగ్గిన పత్తి వ్యాపారం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 12:24 PM