Share News

తగ్గిన పత్తి వ్యాపారం

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:13 AM

పత్తి ధరలు పెరిగినా మార్కెట్‌లో కొనుగోళ్లు మాత్రం గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి వ్యాపారం సగానికి పైగా పడిపో యింది.

తగ్గిన పత్తి వ్యాపారం
Jammikunta Cotton Market

  • రూ.61 కోట్ల నుంచి రూ.27 కోట్లకు లావాదేవీలు

జమ్మికుంట(కరీంనగర్): పత్తి ధరలు పెరిగినా మార్కెట్‌లో కొనుగోళ్లు మాత్రం గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి వ్యాపారం సగానికి పైగా పడిపో యింది. జమ్మికుంట వ్యవ సాయ మార్కెట్‌లో సెప్టెం బరు 23న ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు నేటికి 47 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రైతులు యార్డులో 21 వేల క్వింటాళ్లు విక్రయించగా, జిన్నింగ్‌ మిల్లులు, బీ టైప్‌ వ్యాపారుల గోదాముల్లో నేరుగా మరో 10 వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా 31 వేల క్వింటాళ్ల పత్తి వ్యాపారం జరిగింది.


jmt1.2.jpgగతేడాది ఇదే సమయానికి 83 వేల క్వింటాళ్ల కొనుగోళ్లు జరగడం గమనార్హం. అంటే ఈసారి 52 వేల క్వింటాళ్ల కొనుగోళ్లు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్‌ పత్తికి 7,250 నుంచి 7,600 రూపాయల వరకు ధర పలికింది. ఈసారి గరిష్ఠంగా 9,250, కనిష్ఠంగా 8,350 రూపాయల ధర లభించింది. గతేడాదితో పోలిస్తే కనిష్ఠ ధరలో 1,100 గరిష్ఠ ధరలో 1,650 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తోంది. అయినా కొనుగోళ్ల పరిమాణం మాత్రం 62 శాతం తగ్గింది.


  • భారీగా తగ్గిన కొనుగోళ్లు

గతేడాది కొనుగోళ్ల ధరల సగటు ధర 7,425గా తీసుకుంటే 83 వేల క్వింటాళ్ల పత్తికి 61.62 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈసారి సగటు ధర 8,800 రూపాయలుగా తీసుకుంటే 31 వేల క్వింటాళ్లకు సుమారు 27.28 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్ల పరిమాణం తగ్గడంతో వ్యాపార విలువ 34.34 కోట్లు తగ్గింది. వ్యవసాయ మార్కెట్‌లో ఒక శాతం మార్కెట్‌ ఫీజు ప్రకారం మార్కెట్‌ కమిటీకి 47రోజుల క్రయవిక్రయాల్లో 27.28 లక్షల ఆదాయం సమకూరనుంది. గతేడాది 61.57 లక్షల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్‌ ఫీజు ఆదాయ అంచనా 34.29 లక్షలు తగ్గింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మా చావుకు కోడలు కారణం కాదు

అప్పుల కుప్ప నుంచి అభివృద్ధి వైపు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 11:13 AM