Share News

అఫ్గానిస్థాన్ జట్టుకు షాకిచ్చిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు..

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:11 AM

క్రికెట్‌ స్కాట్లాండ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ దేశ క్రికెట్‌ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకూడదని నిర్ణయించింది.

అఫ్గానిస్థాన్ జట్టుకు షాకిచ్చిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు..
Cricket Scotland

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్‌ స్కాట్లాండ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ దేశ క్రికెట్‌ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకూడదని నిర్ణయించింది. అలానే అఫ్గాన్ జట్టు ఉండే ట్రై సిరీస్‌ల్లోనూ తమ జట్టు ఆడదని స్కాట్లాండ్ తెలిపింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డులు అఫ్గాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆ జాబితాలో స్కాట్లాండ్ జట్టు చేరింది.


అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం అక్కడి మహిళలు, బాలికలపై విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ స్కాట్లాండ్ వెల్లడించింది. అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీలకు మాత్రం నిబంధనల ప్రకారం అఫ్గానిస్థాన్‌తో ఆడేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అఫ్గాన్‌లో మానవ హక్కులు, మహిళల క్రికెట్‌ విషయంలో గణనీయమైన మార్పు వస్తేనే ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తామని స్కాట్లాండ్ స్పష్టం చేసింది.


అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) విషయంలో తమ దేశ ఆటగాళ్లకు స్కాట్లాండ్ ఊరట నిచ్చింది.ఏపీఎల్‌ డ్రాఫ్ట్‌లో ఎంపికైన ఏకైక స్కాటిష్ ఆటగాడు జార్జ్ మున్సేకి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్‌ఓసీ) ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మున్సీ లేదా ఇతర స్కాటిష్ ప్లేయర్లు ఏపీఎల్‌లో పాల్గొనడాన్ని తాలిబన్ ప్రభుత్వానికి మద్దతుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. కాగా, 2021లో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విధించించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

అక్షర్‌ ట్రేడ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అశ్విన్‌ కీలక సూచనలు!

భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన

41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్..

Updated Date - Nov 10 , 2026 | 11:11 AM