Share News

కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:25 PM

ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తన కుమారుడు అన్నారని.. అయితే ఈ మాటలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు..  జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
JC Prabhakar Reddy

అనంతపురం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తన కుమారుడు అన్నారని.. అయితే ఈ మాటలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు జర్నలిస్టులు ఏది పడితే అది రాస్తున్నారని ధ్వజమెత్తారు. అస్మిత్ రెడ్డి పెద్ద తప్పు చేసినట్లు ప్రసారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ(శనివారం) అనంతపురం వేదికగా మీడియాతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.


తాడిపత్రి అభివృద్ధి గురించి వారికి తెలీదు..

తాడిపత్రిలో చేస్తున్న అభివృద్ధి ఏంటో జగన్ అండ్ కోకు తెలియదని.. వారికి చెప్పాల్సిన అవసరం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగన్ హయాంలో చేసిన అప్పులకు.. తమ ప్రభుత్వం వడ్డీని కడుతోందన్నారు. ఇప్పుడు తమ గురించి మాట్లాడిన జర్నలిస్టులు.. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిని కూడా చూపించాలని సూచించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేర్పించిన విజన్‌తో బతుకుతున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్రమిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.


ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వదిలేశారు..

వైసీపీ హయాంలో పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వదిలేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేసినట్లే.. తాము తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ ఆఖరికి తాడిపత్రికి సోలార్ విద్యుత్ వస్తుందని తెలిపారు. కడప, కర్నూల్‌లో లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాడిపత్రిలో ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 04:25 PM