Share News

ఆర్డీటీ ఓ సంస్థ కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: నారా లోకేశ్

ABN , Publish Date - May 14 , 2026 | 08:39 PM

ఆర్డీటీ ఓ సంస్థ కాదని.. గొప్ప సేవా వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆర్డీటీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 ఆర్డీటీ ఓ సంస్థ కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: నారా లోకేశ్
AP Minister Nara Lokesh

శ్రీ సత్యసాయి జిల్లా, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ ఓ సంస్థ కాదని.. గొప్ప సేవా వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఆర్డీటీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తాను ఆర్డీటీ సేవలు చూశానని.. ఇక్కడ అందుతున్న సేవలు తనను బాగా కదిలించాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (గురువారం) ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. తాను చేపట్టిన పాదయాత్ర అనంతపురం దాటినా అనేకసార్లు ఆర్డీటీ గురించి తెలుసుకున్నానని తెలిపారు. గతంలో అనేక ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు.


ఆర్డీటీకి భవిష్యత్తులోనూ అండగా ఉంటా..

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) డెరెక్టర్ మాంచో ఫెర్రర్‌తో చాలాసార్లు మాట్లాడి ఫాలో ఆప్ చేశామని మంత్రి లోకేశ్ తెలిపారు. అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తోండటంతో తాను మద్దతు ఇచ్చానని అన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇలాంటి సంస్థలు, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసమే తాను పాదయాత్ర చేశానని ప్రస్తావించారు. ఆర్డీటీ సంస్థకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి అందరూ అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో ఓర్పు, సహనంతో సేవలు చేస్తూ వచ్చిన మాంచోకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ సేవలు రాయలసీమకే కాదని.. ఏపీకి విస్తరించాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రేమతో సేవ చేయడం మాంచో కుటుంబం ఆశయమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


లోకేశ్‌కు ఘన స్వాగతం..

అంతకుముందు బత్తలపల్లిలో మంత్రి నారా లోకేశ్‌కు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌ను చూడటానికి తరలివచ్చారు. మంత్రి నారా లోకేశ్ రాకను పురస్కరించుకొని పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బత్తలపల్లి సెంటర్ నుంచి టీడీపీ శ్రేణులతో కలిసి లోకేశ్ భారీ ర్యాలీ తీశారు. అందరికీ అభివాదం చేస్తూ లోకేశ్ ముందుకు సాగారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 08:52 PM