Share News

టమోటా కిలో రూ.20

ABN , Publish Date - Aug 26 , 2026 | 01:46 PM

ఉమ్మడి అనంతపురం జిల్లా కక్కలపల్లిలోని మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మల్లికా తెలిపారు.

టమోటా కిలో రూ.20
tomato price

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా కక్కలపల్లిలోని ప్రైవేట్‌ మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మల్లికా తెలిపారు. మార్కెట్‌కు 4వేల టన్నుల టమోటా కాయలు వచ్చాయన్నారు. సరాసరి రూ.15, కనిష్ఠంగా రూ.10తో విక్రయాలు జరుగుతున్నాయన్నారు.


చీనీకాయలు టన్ను రూ.15వేలు

అనంతపురం రూరల్‌: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.15వేలతో అమ్ముడుపోయినట్లు వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి గోవిందు తెలిపారు. సరాసరి రూ.13వేలు, కనిష్ఠంగా రూ.7వేలతో విక్రయాలు జరిగాయన్నారు. మార్కెట్‌కు మొత్తంగా 692.3టన్నుల కాయలు వచ్చాయన్నారు.


zzz.jpgధర తగ్గిన పుదీన..

హోసూరు(బెంగళూరు): కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు సమీపంలోని ఉద్దన్నపల్లి, శూలగిరి ప్రాంతాల్లో పుదీన ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణగిరి జిల్లా ఉద్దన్నపల్లి ఉలగం, శూలగిరి, ఓడరపాళ్యం, తిమ్మసంద్రం, గుడిసాదనపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు పుదీనా సాగు చేస్తున్నారు. ఇక్కడి పుదీనాను తమిళనాడుతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 400 కట్టలున్న ఒక మూట పుదీనా రూ.3వేల వరకు పలికింది.


దీంతో రైతులు పెద్ద ఎత్తున పుదీనా సాగు చేపట్టారు. ప్రస్తుతం దిగుబడి పెరగడంతో మార్కెట్‌కు విరివిగా రావడంతో ధర క్రమంగా పడిపోయింది. కొన్ని వారాలుగా ఒక మూట పుదీనా కేవలం రూ.100కే పలుకుతోంది. ఒక ఎకరాకు గతంలో 80 మూటల దిగుబడి రాగా ప్రస్తుతం 120 మూటల వరకు దిగుబడి వస్తోంది. ధర లేకపోవడంతో కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఉద్దన్నపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల్లో సాగు చేసిన పుదీనా తోటలను రైతులు తొలగించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం పుదీనా రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆధారాలు చూపించి.. ఓటు నిలుపుకోండి..

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 01:46 PM