Share News

మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..

ABN , Publish Date - Aug 26 , 2026 | 01:23 PM

న్యూయార్క్‌లో జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.

మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..
Madison Square Garden event

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. మమ్దానీ, ఆయనతో ఉన్నవారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీని వ్యతిరేకించడం వల్లే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు (Mary Millben fires on Zohran Mamdani).


మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆగస్టు 29న జరగనున్న కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగించనున్నారు. అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమెరికన్ హిందూ సమాజాన్ని ఒకతాటి పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ మమ్దానీ ఆగ్రహం వ్యక్తం చేశారు (Madison Square Garden event).


అమెరికా ఇప్పటివరకు బహుళత్వం, లౌకిక విలువలు, ప్రతి ఒక్కరికీ స్థానం ఉన్న దేశంగా ఉందని, ఇలాంటి విలువలకు భిన్నంగా ఒక వర్గాన్ని సమీకరించే ధోరణి పెరగడం తనకు ఆందోళన కలిగిస్తోందని మమ్దానీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించనున్న కార్యక్రమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే చట్టపరమైన అధికారం తనకు ఉందో లేదో తెలియదని స్పష్టం చేశారు (RSS chief US event).


ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన మమ్దానీపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ విమర్శలు గుప్పించారు (Mary Millben Mamdani). మోదీ, బీజేపీని వ్యతిరేకించడం వల్లే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించేవారు కావాలంటే డబ్బు సమీకరించి తమ సొంత ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. మోదీ వ్యతిరేకతతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమం తనకు నచ్చిందని, భారత్‌లో మత స్వేచ్ఛపై అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నట్లు మిల్బెన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..


కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 26 , 2026 | 02:21 PM