శునకం.. కావొద్దు భయానకం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:57 PM
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే నానుడిని మనం వింటూ ఉంటాం. అన్న విధంగానే ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవం జరుపుకోవడం గమనార్హం.
ఏటేటా పెరుగుతున్న వీధికుక్కల బెడద
ఈ ఏడాది 774 మందిపై దాడులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో టీకాలు
నేడు అంతర్జాతీయ కుక్కల దినోత్సవం
యాచారం(రంగారెడ్డి): ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే నానుడిని మనం వింటూ ఉంటాం. అన్న విధంగానే ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవం జరుపుకోవడం గమనార్హం. కుక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, వాటి పట్ల ప్రేమ, బాధ్యత, సంరక్షణపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. దొంగతనాలు, హత్యల వంటి కేసుల ఛేదనలో పోలీసులకు ఎంతగానో తోడ్పడే శునకాలతోపాటు పెంపుడు కుక్కలకు సరైన సమయానికి టీకాలు వేయించడం తప్పనిసరి. అయితే గ్రామాల్లో ఏటేటా వీధి కుక్కల బెడద పెరగడం కలవరపెడుతోంది.
సంరక్షణ చర్యలు తప్పనిసరి
పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు వేసే అవి ఆరోగ్యంగా ఉంటాయి. అవి పుట్టిన తర్వాత 15వ రోజు నుంచి మందులు, తగు పోషకాహారం అందించాలి. ప్రతి మూడు నెలలకోసారి టీకాలు ఇవ్వకపోతే అవి వ్యాధుల బారిన పడతాయని, తప్పక టీకాలు వేయించాలని పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ అంకంరాజు తెలిపారు. కుక్కల్లో జెర్మన్‌షెప్పర్డ్, లాబ్రెడార్, రీట్రీయర్, గ్రేట్‌డేన్, రాఫ్ట్‌వీలర్, పోమరైల్ డాబర్‌మ్యాన్, గోల్డెన్ రీట్రీవర్, డ్యాష్‌హండ్, బీగల్, మినైచర్ పోమనైర్, పోమనైర్, ల్యాష్‌హ్యోప్స్, షిట్జూ, శివావా, చౌచౌ, సెట్‌బేనార్డ్, న్యూఫౌండ్ ల్యాండ్, ఇంగ్లిష్ మాస్టిఫ్, బుల్‌మాస్టిఫ్, బెల్‌గమ్‌మలీనియోస్, బుల్‌డాగ్, అఖిత, టిబెటన్ మాసిఫ్ వంటి రకాలున్నాయి.
కుక్కల దాడులతో తీవ్ర నష్టం
జిల్లా పరిధిలోని బాయిలర్‌కోళ్ల షెడ్లలో కోళ్లు చనిపోతే వాటి మాంసం తిన్న వీధి కుక్కలు జనంపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గొర్రెలు, పశువులను చంపి తింటున్నాయి. 2025లో 10 పశువులను 30 గొర్లను చంపాయి. ఈ ఏడాది మహేశ్వరం మండలం కల్వకోల్‌లో శంకరయ్యకు చెందిన 20 గొర్లను చంపాయి. 2025లో జిల్లాలో 7,092 మందిని గాయపరిచాయి. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కియాన్స్ అనే మూడేళ్ల బాలుడ్ని చంపాయి. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు వీదికుక్కల దాడిలో జిల్లాలో 5,346మంది గాయపడ్డారు. కేవలం ఆగస్టు నెలలో 774 మందిని గాయపరిచాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి తెలిపారు. రేబీస్ ప్రమాదకరమైనదని, కుక్క కరిస్తే వెంటనే టీకా వేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు.
ఏటా వందల మంది బాధితులు
ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు, మాడ్గుల, మహేశ్వరం మండలాల్లో ఏటా వంద మందికిపైగా కుక్కకాటుకు గురవుతున్నారు. రోడ్ల వెంట వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. మండల కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క కాటు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. కుక్క కాటుకు గురైన ఆవు, గేదె, మేక, గొర్రెల పాలు తాగొద్దని, వాటి మాంసం కూడా తినొద్దని సూచిస్తున్నారు.
టీకాలు అందుబాటులో ఉన్నాయి
కుక్కకాటుకు గురై న వారికి ఐదు డోస్‌ల టీకాలు వేస్తు న్నాం. ప్రతి ఆసుపత్రిలో కు క్క కాటుకు టీకాలు అందుబాటులో ఉన్నా యి. బాధితులకు ప్రాణాపాయం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. మందులకు కొరత లేదు. పెంపుడు కుక్కను ఇతర కుక్కలతో జత కట్టకుండా చూసుకోవాలి.
డా.రాజ్యలక్ష్మి, వైద్యాధికారి, యాచారం
హంతకులను పట్టుకోవడంలో కీలకం
హంతకులను ప ట్టించడంలో పోలీస్ జాగిలాల పాత్ర కీల కం. చిన్న చిన్న కుక్క పిల్లలను తెచ్చి వాటికి ముందు నుంచే శిక్షణ ఇస్తుంటాం. బాంబుల జాడ కనిపెట్టి పోలీస్ శాఖకు ఎంతో సేవలందిస్తాయి. బాంబులను నిర్వీర్యం చేయడంలోనూ జాగిలాలను వినియోగిస్తాం.
నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో, యాచారం
ఈ వార్తలు కూడా చదవండి:
ఆధారాలు చూపించి.. ఓటు నిలుపుకోండి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News