కృతి సనన్ రాఖీ యాడ్ తొలగింపు.. వివాదం నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:51 AM
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రత్యేక ప్రకటనపై వివాదం రేకెత్తడంతో జివా సంస్థ వెనక్కి తగ్గింది. కృతి సనన్ నటించిన ఆ ప్రకటనను సంస్థ తాజాగా తొలగించింది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రత్యేక ప్రకటనపై వివాదం రేకెత్తడంతో జివా సంస్థ వెనక్కి తగ్గింది. కృతి సనన్ నటించిన ఆ ప్రకటనను సంస్థ తాజాగా తొలగించింది. కృతి ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం, అనంతరం నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి (Kriti Sanon Rakhi ad).
రక్షాబంధన్ నేపథ్యంలో రూపొందించిన ఈ ప్రకటనలో కృతి సనన్ బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించి కనిపించారు. ఈ ప్రకటనలో కృతి డ్రెస్సింగ్‌పై కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ వంటి సాంప్రదాయ పండుగకు ఈ తరహా దుస్తులు సరిపోతాయా అంటూ ప్రశ్నలు వచ్చాయి. ప్రకటనలో కుక్కకు రాఖీ కట్టే సన్నివేశం కూడా చర్చకు దారితీసింది (GIVA Raksha Bandhan ad).
ఈ వివాదంపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. రాఖీ కట్టే సమయంలో బికినీ లేదా లోదుస్తులు ఎందుకు ధరించాలి అని కంగనా ప్రశ్నించారు. మహిళలకు ఎన్నో రకాల దుస్తులు అందుబాటులో ఉన్నప్పుడు రక్షాబంధన్ ప్రకటన కోసం ఇలాంటి స్టైలింగ్ ఎందుకు ఎంచుకున్నారని కంగనా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను కావాలనే వివాదాస్పదంగా రూపొందించారని కూడా ఆమె అభిప్రాయపడ్డారు (Kriti Sanon Kangana Ranaut controversy).
కంగనా వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కృతి సనన్ కూడా స్పందించింది. మహిళ ఏ దుస్తులు ధరించాలనే విషయంపై సమాజం ఎప్పటికీ తీర్పులు ఇస్తూనే ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సంస్కృతి, సాంప్రదాయాలు ఒక మహిళ ధరించే దుస్తుల్లో కాకుండా ఆమె హృదయంలో ఉంటాయని కృతి పేర్కొంది. కేవలం దుస్తులను ఆధారంగా చేసుకుని ఒక మహిళకు తన సంస్కృతి పట్ల గౌరవం ఉందా లేదా అని నిర్ణయించడం సరికాదని ఆమె అభిప్రాయపడింది (Kangana Ranaut bikini remark).
వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జువెలరీ బ్రాండ్ జివా తన రక్షాబంధన్ ప్రకటనను తొలగించింది. కృతి సనన్ ప్రకటనపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియా చర్చల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని బ్రాండ్ పేర్కొంది. ఆ గౌరవంతోనే ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..
కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..