ఆధారాలు చూపించి.. ఓటు నిలుపుకోండి..
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:02 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి తుది దశ ప్రక్రియ హనుమకొండ జిల్లాలో వేగవం తమైంది.
1,32,070 మంది ఓటర్లకు నోటీసులు
రేపటి నుంచి ఆధారాల స్వీకరణ
ఆధారాలు చూపకుంటే ఓటు హక్కు రద్దు
హనుమకొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి తుది దశ ప్రక్రియ హనుమకొండ జిల్లాలో వేగవం తమైంది. మ్యాపింగ్ కాని వారితో పాటు అనా మలిస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలోని వరం గల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని లక్షలాది ఓటర్ల వివరాలను పరిశీలించగా వేలాది మంది ఓటర్ల డేటాలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించా రు. బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందుకుంటున్న వారు ఈ నెల27 నుంచి నిర్ణీత గడువు లోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మ్యాపింగ్ కాని, ఆధారాలు సరిగ్గాలేని ఓటర్లకు ఇళ్ల వద్దకే వచ్చి బీఎల్‌వోలు నోటీసులు అందజేస్తున్నారు. 01-07-1987లోపు జన్మించిన వారు నోటీసులు అందుకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన వారు తప్పకుండా నోటీసు అందు కున్న వ్యక్తితో పాటు తల్లి లేదా తండ్రికి చెంది న గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరణలు, ఆధారాల స్వీకరణ ప్రక్రియ 19 సెప్టెంబరు 2026తో ముగుస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 19 అక్టోబరు 2026న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.
12 రకాల గుర్తింపు కార్డులు ఇవే..
నోటీసులు పొందిన ఓటర్లు 12రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని బీఎల్‌వోకి లేదా తహసీల్దార్ కార్యాలయంలో చూపించి తమ ఓటును సరిచేసుకోవాల్సి ఉంటుంది. 1. ఆధార్ కార్డు, 2. భారత పాస్‌పోర్ట్, 3. పాన్ కార్డ్, 4. డ్రైవింగ్ లైసెన్స్, 5. ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, 6. బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్, 7. మహాత్మా గాంధీ ఉపాధి హామీ జాబ్ కార్డ్, 8. కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, 9. పింఛను బుక్, 10. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డ్, 11. రైతు పాస్‌బుక్ లేదా పట్టాదార్ పాస్‌బుక్, 12. ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్ లను అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
132,070 మందికి నోటీసులు
జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల ని యోజకవర్గాల్లో మొత్తం 483 పోలింగ్ బూత్ లు ఉండగా, 407,317 మంది ఓటర్లు ఉన్నట్లు ఈనెల 17తేదీన అధికారులు ఓటర్ల ముసా యిదాను విడుదల చేశారు. ఈ జాబితాలో 132,070 మందికి అధికారులు నోటీసులు అందించనున్నారు. మంగళవారం నాటికి 1821 మందికి బీఎల్‌వోలు నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్నవారికి నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ గడువులోపు ఆధారాలు చూపకుంటే ఓటుహక్కును కోల్పోతారు. ఆ తర్వాత ఆధారాలు తీసుకువచ్చిన ఆక్టోబరు 15 తర్వాత కొత్త దరఖాస్తులకు ఫారం-6, సవరణలు, పోలింగ్ కేంద్రం మార్పుకు ఫారం-8, అభ్యంతరాల కోసం ఫారం-7 ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
సెప్టెంబరు 19 తేదీలోపు ఆధారాలు అందించాలి..
ఎన్.రవి, (అదనపు కలెక్టర్, హనుమకొండ)
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని ఇటీవల సమీక్షలో కలెక్టర్ ఆదేశించారు. నోటీసులు పొందిన ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన ఆధారాలతో స్పందించాలి. లేకుంటే అక్టోబరు 19న ప్రచురించే తుది ఓటరు జాబితా నుంచి ఓటు హక్కు తొలగించబడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అనామలిస్ అంటే ఏమిటీ?
ఎన్యూమరేషన్ ప్రక్రియలో సరిగా వివరాలు నమోదు కాకపోవడం ద్వారా అనామలిస్ సమస్య తలెత్తింది. ఇంటి పేరు, తండ్రి లేక భర్త పేర్లు తప్పుగా ఉండటం, లేదా వయస్సు నమోదులో వ్యత్యాసాలు ఉండటం చేత, పాతికేళ్ల కిందట వేసిన ఓటుకి, ప్రస్తుత ఓటుకి సంబంధించి సరైన లింక్ లేదా ఆధారాలు చూపకపోవడం, 2002లో ఎక్కడ ఓటు ఉందో చెప్పకపోవడం, తల్లిదండ్రుల వివరాలు ఇవ్వకుండా ఎన్యూమరేషన్ ఫారాన్ని అసంపూర్తిగా నింపి బీఎల్‌వోలకు అప్పగించిన వారిని ఈ అనామలిస్ విభాగంలో చేర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారు తల్లులు.. గత 9 మేడారం జాతర్లలో వచ్చిన బంగారు కానుకల మదింపు
Read Latest AP News And Telangana News And International News And Telugu News