ఆర్ఎస్ఎస్ ర్యాలీకి మద్దతు ఇవ్వను: జోహ్రాన్ మమ్దానీ
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:23 AM
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఈ నెల 29న న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్ వద్ద ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తన మద్దతు లేదని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన గ్లోబల్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 29న న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్వేర్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరగనుంది. అలానే సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఈ ర్యాలీకి తాను మద్దతు ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు. అయితే అది ఒక ప్రైవేటు కార్యక్రమమని, దాన్ని రద్దు చేసే అధికారం నగర మేయర్‌గా తనకు లేకపోయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
న్యూయార్క్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో జోహ్రాన్ మమ్దానీ.. ఆర్ఎస్ఎస్ ర్యాలీ అంశంపై మాట్లాడారు. అలాగే, తాను న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్‌నని ఆయన గుర్తుచేశారు. 'నా తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారత్‌లోనే ఉన్నారు. భారత్ అంటే బహుళత్వాన్ని గౌరవించే సమాజం. అలానే లౌకిక గణతంత్ర దేశం. ప్రతి ఒక్కరికీ సమానంగా చోటు కల్పించే దేశమనే భావనతో నేను పెరిగాను' అని తెలిపారు.
'అలాంటి లౌకిక గణతంత్ర దేశంలో సమఖ్యతను దెబ్బతీసే భావజాలం పెరుగుతుండటం నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏ దేశమైనా సరే ప్రజలను మినహాయించే, విభజించే ఆలోచనలకు నేను వ్యతిరేకము. భారతీయ అమెరికన్‌గా మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరు చోటు కల్పించాలనే విలువలను నమ్మే ఒక నగర ప్రథమ పౌరుడి(మేయర్)గా కూడా నేను ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నాను' అని మమ్దానీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్