Share News

మేడారం కరెంట్‌ బిల్లు రూ.5 లక్షలు!

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:20 AM

మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భారీ మొత్తంలో విద్యుత్‌ వినియోగం అవుతోంది.

మేడారం కరెంట్‌ బిల్లు రూ.5 లక్షలు!
Medaram electricity bill

తాడ్వాయి(ములుగు): మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భారీ మొత్తంలో విద్యుత్‌ వినియోగం అవుతోంది. వివిధ పరికరాలను వినియోగిస్తుండగా డిసెంబరు నుంచి మార్చి వరకు కరెంటు బిల్లు రూ. 5 లక్షలు వచ్చిందని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న క్రమంలో ఇంత భారీ మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌తో మేడారం ఈవో వీరస్వామి చర్చించినట్టు తెలిసింది.


hnk3.jpgఈస్థాయిలో కరెంటు బిల్లు వస్తే కట్టేదెలా? అని తర్జనభర్జన పడినట్టు సమాచారం. దీనిపై పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే ఇంత మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని, ఆ తర్వాత మామూలుగానే వస్తోందని అంటున్నారు. పునరుద్ధరణ పనులకు పరికారాలకు పూర్తిగా దేవస్థానానికి చెందిన ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారానే విద్యుత్‌ను వినియోగించారని తేలింది. ఆ బిల్లును దేవస్థానం నిధుల నుంచి ఎలా వాడుకుంటారని, సంబంధిత కాంట్రాక్టర్‌తో కట్టించాలని పూజారులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారు తల్లులు.. గత 9 మేడారం జాతర్లలో వచ్చిన బంగారు కానుకల మదింపు

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 11:20 AM