Share News

బంగారు తల్లులు.. గత 9 మేడారం జాతర్లలో వచ్చిన బంగారు కానుకల మదింపు

ABN , Publish Date - Aug 26 , 2026 | 10:12 AM

మేడారం సమ్మక్క-సారలమ్మ తొమ్మిది జాతరల సందర్భంగా భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారం వెండి కానుకలకు సంబంధించి రెండు రోజులుగా చేపట్టిన మదింపు ముగిసింది.

బంగారు తల్లులు.. గత 9 మేడారం జాతర్లలో వచ్చిన బంగారు కానుకల మదింపు
Medaram Sammakka Saralamma Jatara

  • మొత్తం బరువు రెండు కిలోలుగా తేల్చిన అధికారులు

  • మిశ్రమ వెండి 203 కిలోలపైనే..

హనుమకొండ: మేడారం సమ్మక్క-సారలమ్మ తొమ్మిది జాతరల సందర్భంగా భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారం వెండి కానుకలకు సంబంధించి రెండు రోజులుగా చేపట్టిన మదింపు మంగళవారం ముగిసింది. ఈ తొమ్మిది జాతరలో తల్లులకు కానుకల రూపంలో బం గారం 2కిలోల 882 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, మిశ్రమ వెండి 203 కిలోల 561 గ్రాముల సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో కానుకల రూపంలో సమకూరిన వెండి, బంగారు కానుకలను హుండీల లెక్కింపు తర్వాత హనుమకొండ ఎస్‌టీవోలో భద్రప రుస్తూ వస్తున్నారు. చాలా కాలం తర్వాత వరంగల్‌లోని ధార్మిక భవన్‌లో పూర్తి స్థాయిలో వీటి మదింపును చేపట్టారు.


1994, 1996, 2000 జాతరల మిశ్రమ వెండి, 2004, 2006, 2008, 2010, 2012 జాతరలకు సంబంధించిన మిశ్రమ వెండి, బంగారం గల ఆరు ట్రంకు బాక్సులను తెరిచి మదింపు వేశారు. మదింపునకు ముందు మిశ్రమ బంగారం 2కిలోల 812 గ్రాముల, 290 మిల్లీగ్రాములు ఉండగా, మదింపు వేసిన తర్వాత 2కిలోల 882 గ్రాములు 500 మిల్లీగ్రాములు ఉంది.


hnk1.jpgమిశ్రమ వెండి మదింపునకు ముందు 201 కిలోలు ఉండగా, మదింపు తర్వాత 183 కిలోల 561 గ్రాములు, స్ర్కాప్‌ 20కి కి లోలు, మిశ్రమ వెండి మొత్తం 203కిలోల 561గ్రాములు ఉన్నట్లు లెక్క కట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జువెల్లరీ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ కట్టా అంజనీదేవి, వరంగల్‌ జోన్‌ ఉప కమిషనర్‌ రామల సునీత, దేవస్థాన పూజారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మధింపు సమయం ఓ బంగారం కానిది, వెండితో కలిసినది, వెండి కానిది వేరు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 10:12 AM