Share News

వేటు పడితే.. కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా?

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:12 AM

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసిందా? ఒకవేళ వేటు పడితే సురేఖ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇలా రాజకీయ వర్గాల్లో సీరియస్‌గా చర్చ నడుస్తోంది.

వేటు పడితే.. కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా?
Telangana Minister Konda Surekha

వరంగల్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి కొండా సురేఖపై (Telangana Minister Konda Surekha) కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో సీరియస్‌గా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై వేటు వేయడానికి సర్వం సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే కొండా సురేఖ ప్రస్తుతం దేనిపైనా స్పందించకుండా మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. నిన్నటి (మంగళవారం) నుంచి ఆమె హనుమకొండ రామ్‌నగర్‌లోని తన నివాసంలో ఒంటరిగా ఉన్నారని సమాచారం. ఎవరినీ కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడంలేదు.


అధిష్ఠానం నిర్ణయం తర్వాతే స్పందన

సురేఖపై వేటు వేయాలని క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. కానీ పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వేటు విషయంపై క్లారిటీ వచ్చాకే స్పందించాలని సురేఖ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి మౌనదీక్ష చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ వేటు వేస్తే ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్ని వార్తలు వచ్చినా కొండా దంపతులు మాత్రం స్పందించడం లేదు.. ఖండించడమూ లేదు. దీంతో వీరి వ్యూహం ఏంటో ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది.


ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సురేఖ తన కూతురి వ్యాఖ్యలకు, తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయినా కుమార్తె మాటలను బహిరంగంగా ఖండించకపోవడంతో సురేఖపై వేటు వేయాలని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్‌.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 11:15 AM