Warangal Congress Political Clash: కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. వరంగల్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి..
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:35 AM
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
హనుమకొండ, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై మండిపడ్డారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తాము ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే నాయిని.
స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళీ ఆలయ పాలక మండలి (Bhadrakali Temple Committee) సభ్యులను ఎలా నియమిస్తారు..? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా..? అని నిలదీశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటీ..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంభిస్తే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికీ..? అని నిలదీశారు ఎమ్మెల్యే నాయిని.
తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి అంటే అందరినీ సమన్వయం చేయాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా టీపీసీసీ వరంగల్ కాంగ్రెస్ (Warangal Congress) నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని సూచించింది. కానీ తిరిగి పార్టీలో ముసలం పుట్టడంతో టీపీసీసీ నిర్ణయంపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News