Srinivas Reddy: ఎమ్మెల్యే సాబ్.. దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:36 AM
బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, పార్టీ మారలేద ని, బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్: బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, పార్టీ మారలేద ని, బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ(BJP) రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి(Tokala Srinivas Reddy) అన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌పై మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో స్థానిక ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలకు తెరలేపారని పేర్కొన్నారు.
స్పీకర్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడంతో తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని చెప్పే సమాధానం విస్తుపోయేలా ఉందన్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేపై శాసనసభాపతి చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే తమ పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తోకల శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరా రు. ఎమ్మెల్యేగా ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారో చెప్పాలన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీలోకి మారడం ప్రకాష్‌గౌడ్‌కు పరిపాటిగా మారిందన్నారు.
గతంలో టీడీపీ నుంచి బీఆర్‌ఎస్ లోకి, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతూ తన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేశారని, ఇది నిజం కాదాని మండిపడ్డారు. ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచానని చెప్పుకొంటున్న ప్రకాష్‌గౌడ్ ఎంఐఎం పుణ్యామా అని గెలుస్తున్నావని చురకలంటించారు.

ప్రకాష్‌గౌడ్ నీతిలేని రాజకీయాలకు పునాది వేసుకున్నారని, రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి చూపించాలన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్నా రు. కాంగ్రె్‌సలో చేరినట్లు చెప్పుకోలేని పరిస్థితి ప్రకాశ్‌గౌడ్‌కు దాపురించిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News