Share News

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:06 AM

మాజీమంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అభాగ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. అభాగ్యుల సేవలో కొనసాగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో గల నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి తన వంతు సాయంగా ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

- త్వరలో చెక్కు అందజేస్తాం: కౌశిక్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్: మాజీమంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(MLA Sabita Reddy) అభాగ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. అభాగ్యుల సేవలో కొనసాగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో గల నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి తన వంతు సాయంగా ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆశ్రమం కోసం నిర్మిస్తున్న సొంత భవనం కోసం ఎమ్మెల్యే స్పందించి తన ఒక నెల గౌరవ వేతనాన్ని సాయంగా ప్రకటించాలని కోరుతూ.. ఆశ్రమం నిర్వాహకుడు గట్టు గిరి ఇటీవల సోషల్‌ మీ డియా వేదికగా వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.


దీనికి స్పందించిన సబిత అక్కడి పరిస్థితిని తెలుసుకుని రావాల్సిందిగా తన కుమారుడు కౌశిక్‌రెడ్డిని పురమాయించారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం బీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డితో కలిసి నాదర్‌గుల్‌లోని ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అభాగ్యుల వివరాలు, వారికి గిరి అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా కొనుగోలు చేసిన స్థలంలో చేపట్టిన సొంత భవనం నిర్మాణ పనులను సైతం ఆయన పరిశీలించారు. భవనం కోసం అయ్యే వ్యయాన్ని గిరి ఆయనకు వివరించారు.


city9.jpg

నెల వేతనం అందజేస్తాం: కౌశిక్‌రెడ్డి వెల్లడి

ఆశ్రమాన్ని, భవన నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి ఎమ్మెల్యే సబితారెడ్డి సహకారం ఎళ్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. గిరి విజ్ఞప్తి మేరకు అభాగ్యుల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఒక నెల వేతనం రూ.2.30లక్షలను విరాళంగా అందజేస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే తమ అమ్మగారైన సబితారెడ్డి ఆశ్రమాన్ని సందర్శించి సదరు మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేస్తారని ఆయన తెలిపారు. గట్టు గిరి మాట్లాడుతూ కేవలం తమ స్థానిక ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉదార హృదయులు స్పందించి భవనం నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 11:06 AM