CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:02 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.
వరంగల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
2026 జనవరి 28వ తేదీ నుంచి మేడారం జాతర (Medaram Jatara) జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేడారం అభివృద్ధికి రూ.150కోట్లు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. జాతరకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే మేడారం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. మేడారంలో సీఎం పర్యటనలో భాగంగా జరిగే సమీక్షా సమావేశంలో ఆలయ మాస్టర్ ప్లాన్‌ను ఫైనల్ చేయనున్నారు. గద్దెల వద్ద నూతన నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, జంపన్న వాగుపై చెక్ డ్యామ్‌తో సహా పలు అభివృద్ధి పనులపై సమీక్ష చేసి సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
For More TG News And Telugu News