Share News

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:57 PM

జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్‌రావు గుర్తుచేశారు.

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు
MP Raghunandan Rao Fires on Congress

విజయవాడ, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి (Vijayawada Indrakiladri Durga Malleswara Swamy Temple)ని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (BJP Medak MP Raghunandan Rao) ఇవాళ(మంగళవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని వివరించారు. దసరా ఏర్పాట్లు బాగా చేసిన కలెక్టర్, ఆలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆలయ కమిటీలు ఇంకా వేసినట్లు లేదని, త్వరలో వేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు ఎంపీ రఘునందన్‌రావు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025లో దసరా, దీపావళి పండుగలను జీఎస్టీ రూపంలో ముందుగానే తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. కొంతమంది తెలివి లేని వాళ్లు జీఎస్టీ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్లందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని గుర్తుచేశారు. దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని పేర్కొన్నారు. 4 స్లాబులుగా ఉండే జీఎస్టీని 2 శ్లాబులుగా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మేడారం జాతరకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు: సీఎం రేవంత్‌

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 07:07 PM