Telangana High Court: కేబినెట్ హోదాలపై పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:30 PM
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా (Cabinet Posts) కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది.
కాంగ్రెస్ నేతలు కేశవరావు , పోచారం శ్రీనివాసరెడ్డి , సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్, చిన్నారెడ్డిలతోపాటు మరో తొమ్మిది మందికి కేబినెట్ హోదా చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ప్రస్తావించారు. రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మాత్రమే కేబినెట్ హోదా ఇవ్వాలని వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందని వివరించారు ఏరోళ్ల శ్రీనివాస్.
రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసి పుచ్చి ఓ నెంబర్ కేటాయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2017లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వేసిన పిల్‌తో పాటు బీఆర్ఎస్ పిటిషన్లను కలిపి వచ్చే వారంలో విచారణకు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News