JNTU Hyderabad: జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్.. గెస్ట్ ఫ్యాకల్టీపై పలుమార్లు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:50 AM
జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్ బండారం బయటపడింది. గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడికి పాల్పడిన ప్రొఫెసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: నగరంలోని జేఎన్టీయూలో (JNTU) దారుణం చోటు చేసుకుంది. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజిక వర్గం అంటూ నమ్మించి మరీ బాధితురాలిని ప్రొఫెసర్ వంచించాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. భయపెడుతూ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు బాధితురాలి కాపురాన్ని కూడా కూల్చేశాడు కీచక ప్రొఫెసర్. వర్క్ ఉందంటూ బాధితురాలిని అర్ధరాత్రి వరకు తనతోనే ఉంచుకున్నాడు ప్రొఫెసర్. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో బాధితురాలు ఒంటరిగా ఉంటోంది.
అంతేకాకుండా ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా మలుచుకుని శారీరకంగా, మానసికంగా ప్రొఫెసర్ మరింతగా వేధింపులకు గురిచేశాడు. తన ఛాంబర్‌లో కూడా బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రోజు రోజుకు ప్రొఫెసర్ వేధింపులు అధికమవడంతో బాధితురాలు తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఫ్రొఫెసర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రముఖ విశ్వ విద్యాలయంలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు
Read Latest Telangana News And Telugu News