Kavitha: వాళ్లే టార్గెట్‌గా మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:24 PM
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్‌ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: మాజీ మంత్రి హరీష్ రావు, బీఎర్ఎస్ టార్గెట్‌గా జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో హరీష్, బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని... అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ చేశారు. ‘నేను మంచి దాన్ని కాదు. కాళ్ళు విరగొడతాను’ అంటూ హెచ్చరించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో తాను, తన భర్త ఒక్క పని అయినా అడిగామా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. బీఆర్ఎస్‌లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి సంపాదించలేదని స్పష్టం చేశారు.
హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్‌ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు. ఉద్యమంలో ఎవరు ఏమి చేశారనేది తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చారు. తనను పార్టీ నుంచి పంపించారని.. అయినా వాళ్ల కళ్ళు చల్లబడలేదా అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిచిందని.. కాంగ్రెస్ డోర్స్ ఓపెన్ చేసిందన్నారు. తనపై ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా జవాబు చెబుతానన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చాలా తప్పిదాలు జరిగాయని... అవి తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారనే.. రేవంత్ అధికారంలోకి వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లావాదేవీలకు, కాంగ్రెస్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ‘నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా. హరీష్ రావు.. విజ్ఞత అని తప్పించుకుంటున్నారు. లైన్‌లు నేను దాట లేదు. నేను ఇంకా ఊరుకోను ’ అంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు
Read Latest Telangana News And Telugu News