Share News

Telangana BJP: బీజేపీ మరో కీలక నిర్ణయం.. నీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధం

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:38 AM

తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.

Telangana BJP: బీజేపీ మరో కీలక నిర్ణయం.. నీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధం
Telangana BJP

హైదరాబాద్, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ (Telangana BJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు. తెలంగాణ అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కమలం పార్టీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు.


కేంద్ర ప్రభుత్వంపై నెపం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీపీ రాజాకీయాలు తెలంగాణలో చెల్లదంటూ స్పష్టం చేశారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నెపం పెడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటి కోసం ఒప్పుదం చేసింది ఎవరనీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కమలం పార్టీ నేతలు. తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం చేసింది కేసీఆరేనని ఆరోపిస్తున్నారు.


కేసీఆర్‌వి ఓటీపీ రాజకీయాలు..

ఇన్నాళ్లు ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఓటీపీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇప్పుడు తెలంగాణకు సరైన నీటి వాటా తీసుకురావడంలో విఫలం అవుతోందని మండిపడ్డారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో కృష్ణా నీటిని తరలించుకు పోతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై తమ వాదనను బలంగా వినిపిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే నీటి వాటాలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని బీజేపీ నేతలు ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అన్యాయంపై సమగ్ర సమాచారం అందిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

For More TG News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 11:45 AM