Share News

Prabhakar Fires on BJP And BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపు.. మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:01 PM

యూరియా సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరుబాట పడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Prabhakar Fires on BJP And BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపు.. మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం
Minister Ponnam Prabhakar Fires on BJP And BRS

హైదరాబాద్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం యూరియా ఇవ్వలేదని.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కుమ్మకై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చిందని ఆరోపించారు.


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి ఎరువుల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. రాంచందర్‌రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయనకు రాజకీయ విమర్శలు తప్పా, రైతుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. యూరియా కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా..? అని నిలదీశారు.


సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులు, ఎంపీలు యూరియాపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. యూరియా ఉత్పత్తి, సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు పాజిటివ్‌గా ఉన్నారని ఉద్ఘాటించారు.


రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్‌లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆపేశారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా కొరతకు (Urea Shortage) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్.


యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎరువుల అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరుబాట పడుతామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట, పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరణ

ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్

For More TG News And Telugu News

Updated Date - Sep 08 , 2025 | 12:08 PM