Megastar Chiranjeevi: చెడు మాటలకు మంచితో సమాధానం.. చిరంజీవి భావోద్వేగం
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:09 PM
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. అయినప్పుటికీ సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలపై స్పందించనని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయినా కొందరు నేతలు (Political Leaders) విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మెగాస్టార్.
రాజకీయ విమర్శలపై స్పందించనని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. తాను చేసిన సేవా కార్యక్రమాలు, అభిమానుల ప్రేమాభిమానాలే రక్షణ అని ఉద్ఘాటించారు. ఎవరేమన్నా మాట్లాడనక్కర్లేదని, చేసిన మంచే మాట్లాడుతోందని స్పష్టం చేశారు. తనపై చెడు రాతలు, మాటలకు తాను చేసే మంచే సమాధానమని నొక్కి చెప్పారు. మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే తనకు తెలుసునని చిరంజీవి పేర్కొన్నారు.
ఇవాళ(బుధవారం) ఫీనిక్స్ షౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు నటులు చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు. రక్తదానం అవశ్యకతను వివరించారు మెగాస్టార్. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. ఒక జర్నలిస్ట్ స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకు ఆలోచన వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆ జర్నలిస్ట్ రాసిన ఓ కథనం ఆధారంగానే బ్లడ్ బ్యాంకుకు అంకుర్పారణ జరిగిందని వివరించారు. ఆ జర్నలిస్ట్‌ను ఇప్పటి వరకు చూడలేదని, కానీ ఎప్పుడు ఆయన గుర్తుంటారని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పింది: బండి సంజయ్
చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండపై ఈడీ ప్రశ్నల వర్షం
Read latest Telangana News And Telugu News