Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:47 PM
బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే పేద వాడి పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో మనం ఉండటం మన అదృష్టమని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ పదవి కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీలో రాష్ట్ర వాటా, కేంద్ర వాటా తీసివేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పెత్తందారు పార్టీ అని ఆక్షేపించారు. పేదలను దోచి ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఎద్దేవా చేశారు మహేశ్ కుమార్ గౌడ్.
బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే పేద వాడి పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో మనం ఉండటం మన అదృష్టమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి విజన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడుతున్నారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రేవంత్‌రెడ్డి కులగణన సర్వే చేశారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ జనగణన చేస్తామన్నారంటే ఆ ఘనత రేవంత్‌రెడ్డిదేనని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీ విధానాలను ఎండగడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరం కష్టపడి పని చేద్దామని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు
నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం
Read Latest Telangana News And Telugu News