CM Revanth And KCR on Bathukamma: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:08 PM
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఉద్ఘాటించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం రేవంత్‌రెడ్డి ప్రార్థించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచేదే బతుకమ్మ పండుగ అని ఉద్ఘాటించారు. ప్రపంచ సంస్కృతీ, సంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతోందని తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.
ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో.. మహిళలు పిల్లాపాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని చెప్పుకొచ్చారు. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, తెలంగాణ మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి కానుకగా బతుకమ్మ చీరలు అందజేశామని గుర్తుచేశారు. కష్టాలనుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మను కేసీఆర్ ప్రార్థించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News