Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:04 PM
Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్నిరంగాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తెలిపారు. రైతులను అన్నివిధాలా కేంద్రం ఆదుకుంటుందని అన్నారు. ఆరు గ్యారెంటీలను తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీ స్కీంల్లో ఎన్ని అమలు చేస్తున్నారో దమ్ము ఉంటే చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు.
ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ చిల్లర మాటలు ఇక ఆపు అని హెచ్చరించారు. రేవంత్ మాటాలను ప్రజలు మెచ్చడం లేదని అన్నారు. రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.
రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది: కిషన్‌రెడ్డి

యాదాద్రి: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) నిలదీశారు. ఇవాళ(గురువారం) యాదాద్రిలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అన్నివర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లోనూ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నివర్గాల్లోనూ వ్యతిరేకత ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Komatireddy: రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..
Read Latest Telangana News And Telugu News