Share News

Adi Srinivas: బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరింది.. ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - May 22 , 2025 | 08:29 PM

Adi Srinivas: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ పచ్చి నిజాలు చెప్పారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారని అన్నారు.

Adi Srinivas: బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరింది.. ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్
Adi Srinivas

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై (BRS MLC Kavitha) తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరిందని అన్నారు. కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయని చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తోందని తాము చాలాకాలంగా చెబుతున్న మాటలను కవిత సమర్థించారని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమవుతున్నారని కవిత చెప్పకనే చెప్పిందన్నారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహారించిన తీరును కవిత కడిగి పారేసిందని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారని ఆది శ్రీనివాస్ చెప్పారు


కవిత పచ్చి నిజాలు మాట్లాడారు..

‘కవిత పచ్చి నిజాలు చెప్పారని.. మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్‌లో కేసీఆర్ నియంతృ త్వ వైఖరీని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరీని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది. పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె చెప్పారు. కవిత లేఖపైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు..


ఆ నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు..

‘కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. మాజీమంత్రి హరీష్‌రావు అలగడంతో ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలాడు. కవిత లేఖతో బీఆర్ఎస్ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కేసీఆర్ కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

SIT Notice Prabhakar: ప్రభాకర్ రావుకు ఇంటికి పోలీసులు.. ఎందుకంటే

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్

ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు

గుల్జార్ హౌస్ ప్రమాదానికి అసలు కారణం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2025 | 08:39 PM