Telugu States Reservoirs: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. జలాశయాలకు భారీగా వరద నీరు
ABN , Publish Date - Aug 11 , 2025 | 09:16 AM
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద చేరుకుంది. వరద చేరుకోవడంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. నాగార్జునసాగర్, హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది. ఈ జలాశయాల దగ్గర ప్రస్తుత నీటి పరిస్థితి ఇలా ఉంది.
హైదరాబాద్, కర్నూలు, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణలలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. వరద చేరుకోవడంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. నాగార్జునసాగర్, హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది. ఈ జలాశయాల దగ్గర ప్రస్తుత నీటి పరిస్థితి ఇలా ఉంది.
హిమాయత్ సాగర్‌కు పెరిగిన వరద...
హిమాయత్ సాగర్‌కు (Himayat Sagar) వరద నీరు మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగింది. వరద నీరు పెరగడంతో రెండో గేట్‌ను మూడు ఫీట్ల మేర ఎత్తారు. ఇప్పటి వరకు ఒక్క గేటు మాత్రమే అధికారులు తెరిచి నీటిని విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో ప్రమాదకరస్థాయిలో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుకుంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. బంజారాహిల్స్, బుల్కాపూర్, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరద వస్తోంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని అధికారులు మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీవహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. తిరిగి ORR సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. వరద ప్రవాహంతో రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మూసీ పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో : 1027 క్యూసెక్కుల వరద.
ప్రస్తుతం నీటి మట్టం: 513.50 మీటర్లు
ఫుల్ ట్యాంక్ లెవెల్: 513.41 మీటర్లు
ఔట్ ఫ్లో : 1130 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.
నాగార్జున సాగర్ జలాశయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు (Nagarjuna Sagar Project) వరద నీరు కొనసాగుతోంది. ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో : 65,800 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,10,483 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ: 310.849 టీఎంసీలు
నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
జూరాల జలాశయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరద చేరుకుంది.
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం సామర్థ్యం: 317.960 మీటర్లు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 8.531 టీఎంసీలు
పూర్తిస్థాయి సామర్థ్యం: 318.516 మీటర్లు కాగా 9.657 టీఎంసీలకు నీరు చేరుకుంది.
ఇన్ ఫ్లో: 90,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 85,903 క్యూసెక్కులు
మూసీ ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 4,412 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 645 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 643.30 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 4.46 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 3.96 టీఎంసీలు
శ్రీరాంసాగర్ జలాశయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద నీరు పెరుగుతోంది.
శ్రీరాంసాగర్ ఇన్ ఫ్లో : 34 వేల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 8600 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం :1091 అడుగులు
నీటి సామర్థ్యం: 80 టీఎంసీలు
ప్రస్తుత నీటి మట్టం: 1079 అడుగులు
ప్రస్తుతం: 43 టీఎంసీలు
కాకతీయ, లక్ష్మీ సరస్వతి కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి భారీ వరద
మరోవైపు.. నంద్యాల జిల్లాలోని మిడ్తూర్‌లో భారీ వర్షం కురిసింది. ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. నందికొట్కూరు నుంచి నంద్యాలకు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీ వరద కొనసాగుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
ఇన్ ఫ్లో : 1,53,098 క్యూసెక్కులు,
ఔట్ ఫ్లో : 65,800 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 881.20 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుత నీటి నిల్వ : 194.3096 టీఎంసీలు
తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం
అలాగే, కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్‌కు (Tungabhadra Dam) వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ డ్యామ్ 4 గేట్లు ఎత్తారు.
తుంగభద్ర డ్యామ్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..
పూర్తిస్థాయి నీటిమట్టం: 1633 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం: 1626.06 అడుగులు
ఇన్ ఫ్లో : 30,689 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 31,775 క్యూ సెక్కులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 105 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 80 003 టీఎంసీలు
సుంకేసుల డ్యామ్‌కు వరద ప్రవాహం
కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరగడంతో 16 గేట్లు ఎత్తివేశారు.
సుంకేసుల డ్యామ్ ఇన్ ప్లో : 70,000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 67, 312 క్యూసెక్కులు
సుంకేసుల రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 0.917 టీఎంసీలు
కేసీ కెనాల్‌కు : 2012 క్యూసెక్కులు విడుదల
పూర్తిస్థాయి నీటిమట్టం: 1633 అడుగులు
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News